ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి…
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా…
ప్రభుత్వం నుంచి ఎన్నో పన్ను మినహాయింపులను బీసీసీఐ పొందుతోందని వస్తున్న విమర్శలపై బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ‘బీసీసీఐ కూడా ఓ కార్పొరేట్ కంపెనీ లాగే పన్నులు చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా కడుతోంది. మాకు ఎటువంటి మినహాయింపులు లేవు. మేము వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు కడుతున్నాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి గ్రాంట్ కూడా తీసుకోము’ అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.…
భారత జట్టు మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ టీమిండియాలో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడా? అంటే.. అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజాగా పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా భజ్జీని పంజాబ్ నామినేట్ చేసింది. ఈ నెల చివరలో జరిగే ఏజీఎంకు పంజాబ్ తరఫున అతడు హాజరవుతాడు. సెప్టెంబర్…
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో మ్యాచ్ ఆడొద్దని భారత ఫాన్స్ మండిపడుతున్నారు. బాయ్‌కాట్ ఆసియా కప్ 2025, బాయ్‌కాట్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఐసీసీ, ఏసీసీ నిబంధనల మేరకు ఆడుతున్నామని బీసీసీఐ పెద్దలు చెప్పుకొస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా అది కేవలం అట మాత్రమే అని పేర్కొంది. అయినా కూడా అభిమానుల్లో ఆగ్రహం…
బీసీసీఐ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ పదవీకాలం ముగిసింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి వయోపరిమితి ఉంది. బిన్నీ వయసు 70 ఏళ్లు కావడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన పదవీకాలం ముగిసింది. బిన్నీ అక్టోబర్ 2022లో బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కొత్త అధ్యక్షుడి కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించనుంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన ధ్యక్షుడి పేరును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడి రేసులో…
కొన్నిసార్లు గట్టిగా మాట్లాడేవారి కంటే.. నిశ్శబ్దంగా పోరాడే వారే చరిత్రను సృష్టిస్తారు. అలాంటి వ్యక్తే ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా. ఏనాడూ స్లెడ్జింగ్‌లో పాల్గొనలేదు, సోషల్ మీడియాలో ఏనాడూ అతడికి వ్యతిరేకంగా వార్తలు రాలేదు. ప్రశాంతతకు మారుపేరైన పుజారా.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ బ్యాట్‌తో అండగా నిలబడ్డాడు. రాజ్‌కోట్ వీధుల నుంచి మెల్బోర్న్, జోహన్నెస్‌బర్గ్ వరకు ప్రతి మైదానంలో రన్స్ చేశాడు. ఆసీస్ పర్యటనలో శరీరానికి బంతులు తగిలినా.. జట్టు కోసం క్రీజులో నిలబడ్డాడు. టీమిండియా కోసం…
ఆసియా కప్ 2025 ని భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రికార్డ్ విజయంను అందుకుంది. టీమిండియా తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరగనుంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్, పలువురు ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు.…