Mustafizur Rahman: కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి తీసేయడాన్ని భారత్‌లోని కొందరు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ (BCCI) నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. రాజకీయాలను, క్రీడల్ని ముడిపెట్టొద్దని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్న సమయంలో, ఐపీఎల్‌లోకి బంగ్లా బౌలర్‌ను తీసుకోవడంపై పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
Read Also: Congress: వెనిజులా లాగే ట్రంప్ ప్రధాని మోడీని కిడ్నాప్ చేస్తారా.? మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
‘‘ క్రీడలు, రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. కానీ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న సంఘటనలతో భారత సమాజం ఆగ్రహంగా ఉంది. ఇది క్రీడా వాతావరణంపై ప్రభావం చూపుతోంది’’ అని అన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు హిందూ ఆటగాడు లిట్టన్ దాస్‌ను కెప్టెన్‌గా నియమించిందని, దీనిని కూడా భారత్ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ నేత శశిథరూర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా రాజకీయాలను, క్రికెట్‌ను ముడిపెట్టొద్దని అన్నారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులపై హత్యాకాండ ఆగడం లేదు. ఇప్పటికీ 6 మంది హిందువుల్ని అక్కడ మతోన్మాదులు దారుణంగా హత్య చేశారు. గత 48 గంటల్లోనే ఇద్దర్ని హత్య చేశారు. హిందూ మహిళపై అత్యాచారం చేసి, ఆమె జట్టు కత్తిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.