Aiden Markram Reaction: ఓ పక్క సుస్సు పడింది.. ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ ఆడలేదు!
- అఫ్గానిస్థాన్‌పై రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా విజయం
- దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఇలాంటి మ్యాచ్ కెరీర్‌లోనే ఎప్పుడూ ఆడలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నడూ ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఆడలేదన్నాడు. మ్యాచ్‌లో జరిగిన కొన్ని పరిణామాలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని, ఓటమి భయం కూడా కలిగిందని నిజాయితీగా చెప్పాడు. నిజం చెప్పాలంటే ఓ సమయంలో సుస్సు పడిందని మార్‌క్రమ్ చెప్పుకొచ్చాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఎయిడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ… ‘నా క్రికెట్ కెరీర్‌లో ఇలాంటి మ్యాచ్ నేను ఎప్పుడూ ఆడలేదు. ఇది నిజంగా అద్భుత మ్యాచ్. బంతి బంతికి నాలో ఉత్కంఠ పెరిగింది. ఓడిపోతామేమో అన్న భయం నాకు చాలాసార్లు అనిపించింది. ఒక సమయంలో క్వింటన్ డీకాక్ నా దగ్గరకు వచ్చి.. ఈ మ్యాచ్ ఓడిపోతే మన పరిస్థితి ఏంటి?, ఎంత అవమానంగా ఉంటుందని అన్నాడు. అది ఆలోచించాక నాలో ఇంకా టెన్షన్ పెరిగింది’ అని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేయగా. అఫ్గాన్ 19.4 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. మొదటి సూపర్ ఓవర్ టై కాగా.. రెండో సూపర్ ఓవర్లో సఫారీలు గెలిచారు.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
Also Read: Nara Lokesh: ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే.. అయానా, గయానా కంపెనీలకు భూములు ఇవ్వలేదు!
అఫ్గానిస్థాన్ జట్టు ప్రదర్శనను ఎయిడెన్ మార్‌క్రమ్ ప్రశంసించాడు. అఫ్గానిస్తాన్ బ్యాటర్ గర్బాజ్‌తో పాటు మొత్తం జట్టుకు అభినందనలు తెలిపాడు. ‘అఫ్గానిస్థాన్ టీమ్ అద్భుతంగా ఆడింది. గర్బాజ్ ఆసాధారణ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. మిగతా వారు కూడా చాలా బాగా ఆడారు. చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా ప్లేయర్స్ చాలా సంతోషించారు. టెన్షన్ పడిన నా సహచరులు.. విన్ కాగానే ఒక్కసారిగా గంతులేశారు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. టోర్నీలో ఇంకా మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది’ అని మార్‌క్రమ్ చెప్పాడు. మార్‌క్రమ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?