రాజీవ్ శుక్లా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అతడి వ్యక్తిగతం అన్నారు. అయితే, బెంగాల్ రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకున్నాను.. ఎంఎస్ ధోనీ రాజకీయాల్లో కూడా బాగా రాణించగలడు.
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. రోస్టర్ విధానంలో మూడు…
బీసీసీఐ యుజ్వేంద్ర చాహల్ కెరీర్‌ను దాదాపుగా క్లోజ్ చేసింది.. అలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కష్టమే అన్నారు ఆకాశ్ చోప్రా. ఇక, యూజీ చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అప్పటి నుంచి నేటి వరకు అతడు ఆడలేదు.
భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు.
హైబ్రిడ్ మోడల్లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు.. తమ స్క్వాడ్‌లో ఇప్పటికే రిషభ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు.
ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి.
ఐపీఎల్ హీరో రింకూ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తూ జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక రోల్ ప్లే చేస్తుంటాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ముచ్చెమటలు పట్టిస్తాడు. ఐపీఎల్ లో అసాధారణ ప్రతిభ కనబర్చి టీమిండియాలో స్థానం సంపాదించాడు. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారికి, యంగ్ ప్లేయర్స్ కు రోల్ మోడల్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రింకూ సింగ్ కు…
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 కొత్త నిబంధనలను జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇది టీమిండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా అనుసరించాలి. వీటిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు కఠిన శిక్షలు కూడా విధించబోనుంది బీసీసీఐ. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం, జీతం కోత వంటి అంశాలు తీసుకురానున్నారు. నిజానికి ఇదంతా జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే అంటూ సమాచారం. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. Also Read:…