Aadi srinivas: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ రాజకీయాల్లో నువ్వా..నేనా.. అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణమని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలన్న విషయంలో బీజేపీకి స్పష్టతే లేదు. బీసీ బిల్లుపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాల్సిందని రఘునందన్ రావుపై విమర్శలు గుప్పించారు. కానీ, ఆయన అది చేయకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం…
MLC Kavitha : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వాస్తు భయంతో సచివాలయానికి రావడం లేదని, కానీ మీడియా ముందు సవాళ్లు విసురుతూ హద్దులు మీరుతున్నారని వ్యాఖ్యానించారు. కవిత మాట్లాడుతూ.. బీసీలకు మద్దతుగా 22వ తేదీన రైలు రోకో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీసీలపై ప్రభుత్వం చేస్తున్న సర్వే న్యాయబద్ధంగా లేదని, గతంలో కెసిఆర్ చేసిన…
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన…
Ponnam Prabhbakar : బీసీల (BCs) హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఎవరైనా సందేహాలుంటే, తాము వాటిని స్వయంగా ప్రధాని సమక్షంలోనైనా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో పారదర్శకంగా, లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కులగణన నిర్వహించామని, ప్రత్యేక కమిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ…
Jogu Ramanna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సుమారు 50 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే ను నిర్వహించింది. ఈ సర్వేను ప్లానింగ్ కమిషన్ఆ ధ్వర్యంలో రూపొందించి, ఆ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో పాటు, అసెంబ్లీ సైతం ఆమోదం తెలిపింది. ఫలితంగా, ఈ నివేదిక అధికారికంగా అమలులోకి వచ్చింది. అయితే, ఈ కుల గణన సర్వే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వేలో “ముస్లిం బీసీలు ” అనే…
MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే నా సమాధానం వేరేలా ఉండేదన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం…ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారన్నారు. దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకువచ్చి విచారణ చేస్తాయని, కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి…