Ponnam Prabhbakar : బీసీల (BCs) హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై ఎవరైనా సందేహాలుంటే, తాము వాటిని స్వయంగా ప్రధాని సమక్షంలోనైనా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో పారదర్శకంగా, లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కులగణన నిర్వహించామని, ప్రత్యేక కమిషన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగిందని తెలిపారు. “మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో బీసీ గణనకు పాలిటికల్ సెట్బ్యాక్‌లు ఎదురైతే, తెలంగాణలో మాత్రం చైతన్యంతో పాటు చట్ట రూపం కూడా తీసుకొచ్చాం,” అని మంత్రి పేర్కొన్నారు.
Mother’s Day 2025 Special : అమ్మ ప్రేమ అనంతం.. Celebrating Mothers Day With Vanitha TV
బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, “కుల గణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ వేసిన చరిత్ర బీజేపీదే,” అన్నారు. మహారాష్ట్రలో బీసీ గణన చేపట్టడంతో అక్కడి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చిందని, అలాగే బీహార్, జార్ఖండ్‌లోనూ కులగణన చేపట్టిన ప్రభుత్వాలను రాజకీయంగా భూస్థాపితం చేశారని ఆరోపించారు. బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి, బీసీలను ముఖ్యమైన పదవుల నుంచి తివాచీకి నెట్టిన బీజేపీకి ఇప్పుడు బీసీ సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం దేశానికి రోల్ మోడల్‌గా మారిందని తెలిపారు. తెలంగాణలో చేసిన కుల గణనను కేంద్రం కూడా పాటించాల్సి వస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఈ చట్టాన్ని ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని మంత్రి స్పష్టం చేశారు.
BrahMos Missile: బ్రహ్మోస్ క్షిపణి పని తీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్ని అడగండి..