మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
Ponnam Prabhakar : హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా నిర్మితమైన చలనచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరగింది. సినిమా చూసిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య, ఎంపీ సురేష్ షెట్కర్,…
మొన్న ఒకరు, నిన్న ఒకరు…. రేపు ఇంకొకరా? వరుసబెట్టి కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు ఎందుకు నోరు జారుతున్నారు? ప్రత్యేకించి ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని తిట్ల పురాణం ఎందుకు అందుకుంటున్నారు? ఏమీ లేని చోట ఏదో ఒకటి రగిలించే ప్రయత్నం జరుగుతోందా? అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయా? పార్టీకి తలపోట్లు తెప్పిస్తున్న ఆ నేతలు ఎవరు? వాళ్ళ టార్గెట్ క్యాస్ట్ ఏది? తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు వరుసబెట్టి నోరు జారుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది.…
బీసీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. పార్టీ నేతలకు ముఖ్యమంత్రి క్లాస్ పీకారు. నేను చేసేది చేసినా.. ఇక మీ ఇష్టం అని నేతలకు సూచించారు. రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి సర్వే.. కర్ర పట్టుకుని కాపాడుకుంటారో లేదో మీ ఇష్టం అని అన్నారు. సర్వే చేసినా నన్ను తిడుతున్నారు.. సర్వేలో కూడా పాల్గొనని వాళ్ళను మంచోడు అంటున్నారని తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత…
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు జరిగిన మంచిని వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ పర్యటన తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్ల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్... పార్టీలో ఓబీసీ లకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే..ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టం.. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. బీసీలు ఇతర రాజకీయ పార్టీలలో గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు…