Off The Record : రెడ్లు టార్గెట్‌గా కాంగ్రెస్ బీసీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్న ఒకరు, నిన్న ఒకరు…. రేపు ఇంకొకరా? వరుసబెట్టి కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు ఎందుకు నోరు జారుతున్నారు? ప్రత్యేకించి ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని తిట్ల పురాణం ఎందుకు అందుకుంటున్నారు? ఏమీ లేని చోట ఏదో ఒకటి రగిలించే ప్రయత్నం జరుగుతోందా? అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయా? పార్టీకి తలపోట్లు తెప్పిస్తున్న ఆ నేతలు ఎవరు? వాళ్ళ టార్గెట్ క్యాస్ట్ ఏది? తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు వరుసబెట్టి నోరు జారుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ… మాట్లాడుతున్న మాటలు ఇటు ఓవరాల్‌గా పార్టీకి, అటు పార్టీలో ఉన్న అదే సామాజికవర్గం నాయకులకు తలనొప్పిగా మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఓ ఎమ్మెల్సీ… రెడ్ల మీద కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. నోటీసుల దాకా వెళ్ళింది ఆ వ్యవహారం. నోటీసులైతే వెళ్లాయి కానీ…తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ మాటల గాయం మానక ముందే…ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్వరం సవరించుకున్నారు. ప్రభుత్వం చేసిన కుల గణనపై సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి… దీనివల్ల జరిగే మేలు ఏంటో చెప్పండి, అవగాహన పెంచండని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. కానీ…. ఆయన చెప్పింది ఒకటి ఐతే…పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది ఇంకోటి అన్నట్టు మారింది వ్యవహారం. బీసీ కుల గణన అంశాన్ని వదిలేసి రెడ్ల మీద పడ్డారు అంజన్‌కుమార్. సొంత పార్టీలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతల మీద దూషణల పర్వం మొదలుపెట్టారట. దీంతో అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల మర్మం ఏంటి..? ఎందుకు ఆయన ప్రత్యేకంగా రెడ్డి నాయకులను టార్గెట్ చేశారన్న చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీలో.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి,,, ఇలా కొన్ని పేర్లను కూడా కోట్ చేశారట ఆయన. ఇప్పుడిదే హాట్ సబ్జెక్ట్ అవుతోంది. ఆయన అసలు ఎందుకంత ఘాటుగా మాట్లాడారు, ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చిందని ఆరాతీస్తే… అందులో కూడా రాజకీయ అవసరాల సబ్జెక్ట్ ఉండవచ్చని అంటున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వంలో తన అవకాశాల్ని రెడ్లు అడ్డుకుంటున్నారన్న అక్కసు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకుండా రెడ్లు అడ్డుకున్నట్టు ఫీలవుతున్నారట ఆయన. అయితే… అంజన్ వ్యాఖ్యల తర్వాత….. అసలు సిసలైన రచ్చ మొదలైంది. ఆ మాటల మీద అటు రెడ్డి నాయకులు ఫైరైపోతూ… అంజన్ వ్యాఖ్యల్ని తూర్పారబడుతున్నట్టు సమాచారం. ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడమేకాకుండా….గ్రేటర్ హైదరాబాద్ అంతా అప్పగిస్తే… ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూశారుగా అంటూ పాయింట్ లాగుతున్నారట కాంగ్రెస్… రెడ్డి నాయకులు. అంత జరిగాక కూడా… అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్‌కి పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చిందని, ఇక అంతకు మించి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అంజన్ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌లో పెను దుమారం రేపబోతున్నట్టు సమాచారం. అసలు బీసీ కులగణనపై అవగాహన కల్పించే పని వదిలేసి… ఇలా తిట్ల దండకం ఎత్తుకోవడంపై పార్టీలో సీరియస్‌గానే చర్చ జరుగుతోందట. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలు ఎన్ని..? పార్టీకి అంజన్ కుటుంబం చేస్తోంది ఏంటి..? అంటూ వ్యతిరేక వర్గం చర్చకు పెడుతోందట. ఇలా…. ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తున్న వాళ్ళు మాత్రం… ఏమైనా కాంగ్రెస్ కల్చరే కల్చరబ్బా…. సమస్య లేని చోట సృష్టించుకుని లొల్లి పెట్టుకోవంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అంటున్నారట.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!