బనగానపల్లెలో టిడిపి, వైసిపి పోరు పొగలు సెగలు రేపుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరస్పర ఆరోపణలు ఒకవైపు, కాటసాని అనుచరుడి కిడ్నాప్, మరో అనుచరునిపై దాడి ఘటనలతో పరిస్థితి చేయిదాటి పోయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయట. బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి ఆచారి పై టిడిపి కార్యకర్తలు…