తెలంగాణలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెల నుంచి పట్టణాల వరకు.. ఇప్పుడు విదేశాలకు సైతం బతుకమ్మ వేడుకలు విస్తరించాయి.. అయితే, బతుకమ్మ ఆడే విధానంలో మార్పు రావొచ్చు.. కానీ, ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అంటే పల్లెలే గుర్తుకు వస్తాయి.. పల్లెల్లో దొరికే ప్రతీ పువ్వును తీసుకొచ్చి… భక్తితో బతుకమ్మలను పేర్చి.. ఊరంతా ఒక్కదగ్గర చేరి.. బతుకమ్మ విశిష్టతను చెప్పే పాటలు పాడుతూ.. లయబద్ధంగా ఆడుతూ.. ఆ తర్వాత గంగా దేవి ఒడికి చేర్చుతారు.. తొమ్మిది…
Bathukamma: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సందడి నిన్న మిన్నంటేలా మొదలైంది. ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో ఆటపాటలతో పూల పండగ చేసుకుంటున్నారు. సాయంత్రం అవుతోందంటే చాలు చక్కగా ముస్తాబై వాడవాడలా వీధివీధినా కోలాటాలతో కోలాహలంగా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి ముదుసలి వరకు అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Bathukamma Festival: తెలంగాణలో ఈరోజు నుంచి బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఏడాది బతుకమ్మ పండగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9 రోజులపాటు ఈ వేడుకలు జరగబోతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూలతో బతుకమ్మ పండుగ మొదలయ్యి చివరిరోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు పరిసమాప్తమవుతాయి. ఈనేపథ్యంలో.. లంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.…