జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ చొరబాట్లు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. జనాభా కంటే ఎక్కువ ఓటరు కార్డుల వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల్లో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో అధికార జేఎంఎంపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో గెలవడానికి బంగ్లాదేశీయుల పేరుతో నకిలీ ఓట్లు వేయించారని బీజేపీ ఆరోపించింది.