PAK vs BAN: రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో బంగ్లాదేశ్‌కు ఇది 3వ విజయం కాగా.., ప్రస్తుత వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ రౌండప్ లో పాకిస్థాన్‌కి 5వ ఓటమి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 274 పరుగులు చేసింది. లిటన్ దాస్ సెంచరీ (138) తో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. ఇందులో బంగ్లాదేశ్‌లో హసన్ మహమూద్ 5 వికెట్లు, నహిద్ రాణా 4 వికెట్లు తీశారు. జకీర్ హసన్ (40) ధాటికి బంగ్లాదేశ్ 185 పరుగుల విజయలక్ష్యాన్ని 4 వికెట్లను కోల్పోయి అందుకుంది.
Pak vs Ban: పాక్ టీంపై ఫన్నీ మీమ్స్.. చూసి నవ్వుకోండి!
బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో 45.83 శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ ఈ రౌండప్ లో 3 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే 3 మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును బంగ్లాదేశ్ టేబుల్ లో దాటేసింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు 45 శాతంతో 5వ స్థానానికి పడిపోయింది. ప్రొటీస్ జట్టు 38.89 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఇక WTC 2023-25లో పాకిస్తాన్ కేవలం 2 టెస్టులు గెలిచింది. అలాగే 5 ఓడిపోయింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ జట్టు 19.05 శాతంతో పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇక పాకిస్థాన్ కంటే దిగువన వెస్టిండీస్ జట్టు చివరి తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. WTC 2023-25లో కరీబియన్ జట్టు మొత్తం 9 టెస్టులు ఆడింది. ఇందులో 1 మ్యాచ్ గెలిచి 6 ఓడిపోయింది.
Liquor Policy Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. సెప్టెంబర్ 11 వరకు కస్టడీ పొడిగింపు..!
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం WTC 2023-25లో మొత్తం 9 టెస్టులు ఆడింది. అందులో 6 విజయాలు సాధించింది. భారత్ ఇప్పుడు 68.51 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా తమ గత సిరీస్‌లో 2-0తో న్యూజిలాండ్‌ను ఓడించగా.., కంగారూ జట్టు 62.5 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌కు 50 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతుంది.