Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి వందలాది మంది మరణాలకు కారణమైంది యూనస్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. దీనిపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. గతేడాది బంగ్లాదేశ్ హింసాత్మక అల్లర్లలో చాలా మంది మరణించారు. అల్లర్లు శృతిమించడంతో హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉంది. పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ముగియకముందే ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు నమోదైంది.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారు. బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టిన కొద్ది గంటల్లోనే ఆమె అధికారిక నివాసం గణ భవన్‌ను ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తిరుగుబాటు స్థాయికి చేరుకుంది. సోమవారం (ఆగస్టు 5) ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో.. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పెట్టి పారిపోయారు.
Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆర్మీ పాలనను చేతుల్లోకి తీసుకోనున్నట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థల ద్వారా కథనాలు వెలువడుతున్నాయి.
Bangladesh: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.