Sheikh Hasina: దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. దేశంలో విద్యార్థుల నిరసనల తర్వాత జరిగిన తిరుగుబాటు గురించి ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలు అమెరికా కుట్రపన్ని పాకిస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగ్రవాద దాడి అని షేక్ హసీనా పేర్కొన్నారు. READ ALSO: LVM3-M5 Rocket: నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్ విదేశీ కుట్రలో భాగం..…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
Bangladesh: గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ ఉద్యోగ కోటాలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ప్రధాని షేక్ హసీనా దిగిపోవాలని ఉద్యమించారు. అయితే, ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. చివరకు ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది.
గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు, తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ దేశంలో భారీ హింసను చూసింది. బంగ్లాదేశ్‌లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజిద్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ చర్యలో కనీసం 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం బుధవారం అంచనా వేసింది.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో మరోసారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు.
బంగ్లాదేశ్‌లో కోటా ఉద్యమం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇక షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థి సంఘాలను తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ప్రశంసలతో ముంచెత్తారు. ఎలాంటి సందేహం లేదు... విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని ఆదివారం రాత్రి విద్యార్థులతో సమావేశం అనంతరం యూనస్ విలేకరులతో అన్నారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పరిణామాలు భయాందోళనగా మారాయి. హిందువుల్ని లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశారు.