Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఆర్మీ పాలనను చేతుల్లోకి తీసుకోనున్నట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థల ద్వారా కథనాలు వెలువడుతున్నాయి.
బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలతో రక్తసిక్తమైంది. గత నెల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం ఆగస్టులో మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర హింసకు దారి తీసింది.
ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ సహకారంతో 6700 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Bangladesh: రిజర్వేషన్లపై నిరసనలు బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తంగా మారాయి. 1970లలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.
Bangladesh: రిజర్వేషన్ల వివాదంతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల కోటా రిజర్వేషన్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.