BCCI vs BCB: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్‌కప్ 2026లో బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించేలా వేదిక మార్పు చేయాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కు అధికారిక ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ శనివారం (జనవరి 3) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
Read Also: Nayanthara : ఓ వైపు డివోషనల్ ఫిల్మ్.. మరోవైపు యాక్షన్ ఎంటర్టైనర్స్
ముస్తాఫిజూర్ కాంట్రాక్ట్ రద్దుతో రాజుకున్న చిచ్చు
బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు బీసీసీఐ ఆదేశాలు ఇవ్వడంతో వివాదం ప్రారంభమైంది. ముస్తాఫిజూర్‌ను కేకేఆర్ తప్పించిన వార్తలు బంగ్లా క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయన్న వార్తలు కూడా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడంతో ఈ అంశం మరింత సున్నితంగా మారింది. దీనిపై బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తీవ్రంగా మండిపడ్డారు. బంగ్లాదేశ్, మా దేశ క్రికెట్, మా క్రికెటర్లను అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం.. దాస్యపు రోజులు ముగిశాయని స్పష్టం చేశారు.
Read Also: Home Minister Anitha: అనకాపల్లిలో అగ్ని ప్రమాదం.. కంపెనీ ప్రతినిధులపై హోంమంత్రి అనిత ఫైర్
బంగ్లాలో IPL ప్రసారాల నిలిపివేత..
ముస్తాఫిజూర్ రహ్మాన్ ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో.. ఆ దేశంలో IPL ప్రసారాలను నిలిపివేయాలని సమాచార, ప్రసార శాఖ మంత్రికి తాను విజ్ఞప్తి చేసినట్లు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. దేశ గౌరవం, క్రికెట్ ప్రతిష్ఠ దృష్ట్యా IPL ప్రసారాల నిలిపివేత అంశాన్ని తాత్కాలిక ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
T20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌ల ప్రస్తుత షెడ్యూల్
ఫిబ్రవరి 7న- బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ మధ్య ఈడెన్ గార్డెన్స్..
ఫిబ్రవరి 9- బంగ్లాదేశ్ vs ఇటలి, కోల్‌కతా..
ఫిబ్రవరి 14- బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్, ఈడెన్ గార్డె్న్స్..
చివరి లీగ్ మ్యాచ్- బంగ్లాదేశ్ vs నేపాల్, వాంఖడే స్టేడియం, ముంబై
ఈ మ్యాచ్‌లు భారత్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పుడు వేదిక మార్పు కోరుతూ BCB, బంగ్లా ప్రభుత్వం కలిసి ICCకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడైంది. ఇక, దేశంలో భద్రతాపరమైన ఆందోళనలపై అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేయాలి అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదును ICC కమిటీ సమీక్షించిన తర్వాతే మ్యాచ్ వేదికపై తుది నిర్ణయం తీసుకోనుంది.
వేదిక మార్పు అంత సులువు కాదు..
వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ వేదికను మార్చడం ఐసీసీకి, అలాగే ఆతిథ్య దేశాలకు (భారత్–శ్రీలంక) చాలా క్లిష్టమైంది అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు, బోర్డు మాజీ డైరెక్టర్లు BCCI, IPL నిర్వాహకుల వైఖరిని తప్పుబడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ BCB డైరెక్టర్ ఖలేద్ మహ్ముద్ మాట్లాడుతూ.. షకిబ్ KKRలో ఆడినప్పుడు బంగ్లాదేశ్ మొత్తం KKRకి మద్దతిచ్చింది. ఇప్పుడు ముస్తాఫిజూర్ ఉన్నందుకూ మేమంతా KKR అభిమానులమే.. కానీ ఇలా జరగడం తీవ్ర నిరాశకు, అవమానానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్- బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలపై తీవ్ర ప్రభావం
భారత్- బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఉన్న దౌత్య ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన మూడు వన్డేలు, 3 T20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ షెడ్యూల్ ప్రకటించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో BCCI బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లేందుకు సుముఖంగా లేదని భారత బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సిరీస్ గత ఏడాది కూడా భద్రతా కారణాలతో వాయిదా పడింది. బంగ్లాలో ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.