నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ అలకపూనినట్లు వినవస్తోంది. దీనికి కారణం ఇటీవల ప్రెస్ మీట్ లో థియేటర్లలో టికెట్ రేట్ల విషయంలో నాగార్జున స్పందన అని అంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే విడుదల చేస్తున్నామని తెలియచేయటానికి ఇటీవల విలేకరుల సమావేశం…
ఈ సంక్రాంతికి ఒకే ఒక్క టాప్ స్టార్ నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ జనం ముందుకు వస్తోంది. జనవరి 14న ‘బంగార్రాజు’ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున నటవారసుడు నాగచైతన్య సైతం నటించడం విశేషం. కాగా, వీరిద్దరూ కలసి ఇంతకు ముందు నటించిన ‘మనం’ అప్పట్లో ఘన విజయం సాధించిది. ఇక నాగార్జున తరం హీరోలతో పోలిస్తే సంక్రాంతి సంబరాల్లో ఆయన తక్కువగానే పాల్గొన్నారని చెప్పాలి. అయితే 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో పొంగల్ బరిలోకి దూకి,…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ…
అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాళ్లు ఇద్దరూ సంక్రాంతికి వెండి తెరపై సందడి చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఇటీవల విడుదల చేసిన అప్డేట్స్ లో కూడా సంక్రాంతికి రాబోతున్నాం అని ప్రకటించేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల మధ్య సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ నేపహత్యంలో ‘బంగార్రాజు’ కూడా ఓటిటిలో విడుదల అవుతుందని పుకార్లు వ్యాపించాయి. మేకర్స్ ఓటిటి పుకార్లపై క్లారిటీ ఇస్తూ సోషల్…
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన…
ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘బంగార్రాజు’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశారు. ఇటీవలే నాగ చైతన్య సైతం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో వెండితెరపైకి రానుంది అనేది…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి…
స్టార్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. అయితే స్టార్ సైతం కొంతమంది సెలెబ్రిటీల పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసే అరుదైన అవకాశం వచ్చిందంటే మనలాగే సంబరపడిపోతారు. అభిమానుల్లాగే వారు కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… సౌత్ స్టార్ చైతన్య అక్కినేని కూడా తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన అభిమాన సెలెబ్రిటీతో కలిసి దిగిన పిక్ ను షేర్…
నటుడు నాగ చైతన్య తన నెక్స్ట్ రొమాంటిక్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను ముగించాడు. ఈ విషయాన్ని సినిమాలో నటిస్తున్న మరో స్టార్ నాగార్జున తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “షూట్ చివరి రోజు !! మరొక పెప్పీ డ్యాన్స్ నంబర్ లోడ్ అవుతోంది” అంటూ నాగార్జున ఆ సాంగ్ కు సంబంధించిన పిక్ ను షేర్ చేశారు. ఈ పిక్ లో నాగ చైతన్య ఎరుపు రంగు సిల్క్ కుర్తాలో ఉండగా, నటి కృతి శెట్టి…