స్టార్స్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం సాధారణమే. అయితే స్టార్ సైతం కొంతమంది సెలెబ్రిటీల పట్ల అంతటి అభిమానాన్ని కలిగి ఉంటారు. వారిని కలిసే అరుదైన అవకాశం వచ్చిందంటే మనలాగే సంబరపడిపోతారు. అభిమానుల్లాగే వారు కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… సౌత్ స్టార్ చైతన్య అక్కినేని కూడా తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో తన అభిమాన సెలెబ్రిటీతో కలిసి దిగిన పిక్ ను షేర్ చేస్తూ చై స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
చై తన ఫేవరెట్ డీజే కంపోజర్ బెన్ బోమర్‌ని కలిసినట్టు అభిమానులకు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరో కలిసి ఉన్న సెల్ఫీని పంచుకున్నారు. “భారీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ !! తన సంగీతంతో నా జీవితాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేసిన వ్యక్తిని కలుసుకున్నాను.. నన్ను ముందుకు నడిపినందుకు ధన్యవాదాలు !! చాలా కృతజ్ఞతలు బెన్ బోహ్మర్” అంటూ తన ఉత్సాహాన్ని, సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.
A post shared by Chay Akkineni (@chayakkineni)
ఇక చైతన్య సినిమాల విషయానికొస్తే… తాజాగా ‘బంగార్రాజు’ షూటింగ్ ను పూర్తి చేశాడు. ఆయనతో పాటు ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మ్ మేకర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016 తెలుగు చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. మరోవైపు చైతన్య… అమీర్ ఖాన్ నటించిన “లాల్ సింగ్ చద్దా”లో కూడా భాగం అయ్యాడన్న విషయం తెలిసిందే.