టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ…
యంగ్ హీరో నాగ చైతన్య విడాకుల విషయంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతల బ్రేకప్ వార్తలు వారి అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేశాయి. విడాకుల విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన తరువాత వారు ఇద్దరూ పనిలో పనైపోయారు. ప్రస్తుతం వారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగ చైతన్య భారీ బడ్జెట్ తో రెండు ప్రాపెర్టీలపై భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. Read Also :…
కింగ్ నాగార్జున ఇటీవల తన తదుపరి చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాబోయే ఈ రొమాంటిక్ డ్రామాలో నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.…
సెప్టెంబర్ 20న టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో పంచెకట్టుతో కన్పించిన నాగార్జున “మై హీరో, మై ఇన్స్పిరేషన్…” అంటూ తండ్రి గురించి చెప్పుకొచ్చారు. Read Also : వెంకీమామ అభిమానులకు నిరాశ “సెప్టెంబర్ 20న నాకు చాలా ముఖ్యమైన రోజు. మై హీరో, మై ఇన్స్పిరేషన్… నాన్నగారి పుట్టిన…
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో…
అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్యల క్రేజీ మల్టీస్టారర్ “బంగార్రాజు” షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే చిత్ర బృందం మేజర్ సెకండ్ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని మైసూర్‌లో అడుగు పెట్టింది. నాగ్, చై ఇద్దరిపై ఈ షెడ్యూల్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్ “బంగార్రాజు”లో తన కుమారుడు…
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ “బంగార్రాజు” చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనయుడు అక్కినేని నాగ చైతన్య ఈ పోస్టర్ ను లాంచ్ చేశారు. పోస్టర్ లో నాగార్జున గతంలో నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రంలోని “బంగార్రాజు” పాత్రల్లో కనిపిస్తుండగా మనసును దోచేందుకు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి ఈ లుక్ ను చూసిన అక్కినేని అభిమానుల్లో…
(ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు)నటసమ్రాట్ ఏయన్నార్ వారసునిగా ‘యువసమ్రాట్’గా అడుగు పెట్టిన నాగార్జున తొలి నుంచీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వచ్చారు. అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథా చిత్రాలు అచ్చి వస్తాయని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీగా రూపొందిన ‘విక్రమ్’తో హీరోగా జనం ముందు నిలిచారు నాగ్. ఆ తరువాత ‘మజ్ను’గానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పర్సనాలిటీకి తగ్గ కథలను ఎంచుకుంటూ ఏయన్నార్ అభిమానుల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. నాగార్జున సైతం అదే…
తండ్రి నాగార్జున అక్కినేనితో మరోమారు నాగచైతన్య కలసి నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించే చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలయింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కనుంది. 2016 సంక్రాంతి సందడిలో తనదే పైచేయి అని ‘సోగ్గాడే చిన్నినాయనా’ చాటుకుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ అంటే అక్కినేని అభిమానులకు పండగే మరి! పైగా ఇందులో నాగచైతన్య కూడా నాగార్జునతో కలసి నటించడమంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాయే! ఇంతకు ముందు నాగార్జున, నాగచైతన్య…
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల…