అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దన్నారు. రాముడు BJPకి మాత్రమే దేవుడు కాదని, ఈ అంశాన్ని తమ పార్టీకి ఆపాదించి వివాదాస్పదం చేయొద్దని అన్నారు. తాజాగా- బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో…
రైతు మల్లికార్జున రెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రుషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతోపాటు నేటి యువత మల్లికార్జున రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా…
రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా బీజేపీ చేసింది. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జి లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన…
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని తెలిపారు. దీంతో.. ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని బండి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కన్నెత్తి చూసే పార్టీల పతనం ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు అద్దంకి దయాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ని అలెర్ట్ చేసినట్టు చెప్తున్నారని, బీఆర్‌ఎస్.. బీజేపీ మధ్య ఉన్న అనైతిక రహస్యమైత్రి తెలియదు అనుకోకండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్‌ఎస్ వైపు వెళ్తారు అనే మాటలు చెప్పడం సరికాదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంని కూల్చాలని అనుకుంటే ఇటువైపు నుండి అంతకంటే…
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బండి సంజయ్ మాట్లాడిన మాటలు జ్యోతిషం చెప్పినట్లుగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు. అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ అయోధ్య రామ…
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు…