మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం లో భాగంగా కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కి అడ్డా…పాలమూరు లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. తెలంగాణ లో 10 కి పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని,…
Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే..అని బండి సంజయ్ అన్నారు. ఎంపీ నిధుల నుండి కరీంనగర్ జైలులో అంబులెన్స్ ,ల్యాబ్ అందించారు.
హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఈరోజు సాయంత్రం…
కరీంనగర్‌లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్క్కులర్ ఇవ్వడమా? అని అన్నారు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది…ఇదే ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సీఎంకు లేఖ రాసినా స్పందన లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని, చేసిన పనులకు బిల్లులివ్వరు… కనీసం రికార్డుల్లోకి ఎక్కివ్వరని ఆయన మండిపడ్డారు. ఇట్లయితే సర్పంచులుగా…
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ దమ్ముంటే వినోద్ కుమార్ తో చర్చకి రావాలని బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ కి ఎంపీగా నువ్వేం చేశావో, బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చిద్దామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు తేలేకపోయావన్నారు కేటీఆర్.…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు…
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ తెలంగాణ చౌరస్తా కాషాయమయంగా మారింది. తెలంగాణ చౌక్ లో సంబురాలు అంబురాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు. తెలంగాణ చౌక్ వద్ద ఆనందోత్సవాల మధ్య హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి స్వయంగా బండి సంజయ్…