ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని లేఖలో ప్రస్తావించారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో తెలిపారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి అని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి…
కరీంనగర్ బీజేపీ లో విభేదాలు ముదిరుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ కు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని నేతలు హాజరు అయ్యారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి…
Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు.
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యే సీట్లను ఓట్లను పెంచుకోగలిగింది. తామే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు చెప్పిన బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సైలెంట్ అయింది. మరోవైపు కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచింది. అయితే గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానంలోనే గెలుపొందిన బీజేపీ, ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది.