Bandi Sanjay: దయచేసి ఆలోచించాలని, అందరి గురించి మోడీ ఆలోచిస్తున్నారని, మీరు పువ్వు గుర్తుకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను వెళ్లి మోడీకీ ఓటేస్తా అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Amith Shah: మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్టుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు బేగంపేట్ ఎయిర్ పోర్టు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
బీజేపీ అనేది పెద్ద కుటుంబం.. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. తనకు కల్మషం ఉండదని, ఎవరి మీద కోపం ఉండదని.. ఎవరితో తనకు అభిప్రాయ భేదాలు లేవని ఆయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ కుమార్ పేరును జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితమన్నారు బండి సంజయ్. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా తనని ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన.. కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండని, కేంద్రం నుండి…
కాడెడ్లలా కలిసి నడవాల్సిన, పార్టీని నడిపించాల్సిన వాళ్ళు కీచులాటలకు దిగుతున్నారు. కేరాఫ్ కలహాల కాపురంలా మారిందట వారి వ్యవహారం. నాకు ఒక కన్ను పోయినా ఫర్వేదు… ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలన్న సిద్ధాంతంతో పనిచేసిన ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. చివరికి సవతి ముండమోయాలన్నట్టుగా మారిందట ఇద్దరి వ్యవహారం. ఎవరా ఇద్దరు నేతలు? ఏంటి వాళ్ళ కీచులాట కహానీ? ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ల మధ్య విభేదాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే సూచనలైతే…
Ponnam Prabhakar: నాలుక.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలెపారని అన్నారు. నిన్న ఎన్నికల ప్రచార సందర్భంగా బండి సంజయ్ ని ప్రశ్నించానని అన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు బండి సంజయ్ ఏం చేసారు? అని మండిపడ్డారు. శ్రీరాముని పేరు మీద ఓట్ల ఆడడం కాదు.. మీరు నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం…
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు.
ఎన్నికల షెడ్యూల్ కు గడువు మరో పక్షం రోజులే ఉన్నందున ఆ లోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తన చిత్తుశుద్దిని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేలా కన్పిస్తోందన్నారు. ‘‘6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలకు 70 రోజుల గడువు ముగిసింది. నెలాఖరు…
8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు.