ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. కోడిగుడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. ఆందోలనకు దిగిన మహిళలను ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. మహిళలను అరెస్ట్ చేసి…పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో వైపు అదుపులోకి తీసుకున్న మహిళలను విడిచిపెట్టాలని బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇక అటు కార్పొరేటర్ పై దాడికి నిరసనగా మల్కాజ్ గిరి బంద్ కు పిలుపునిచ్చింది బిజెపి పార్టీ. అయితే… మల్కాజ్ గిరి లో బంద్ ప్రభావం కనిపించడంలేదు. మల్కాజ్ గిరి లోని అన్ని చౌరస్తాలో పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉంది. ఇక అటు బీజేపీ కార్యకర్తలను ముందే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజక వర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.