ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ఓబీసీలంతా మీకు రుణపడి ఉంటారు. దేశ ప్రజలు మిమ్ముల్ని ఎన్నటికీ మర్చిపోరు అని ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్..
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. అయితే, ఈ భేటీ సందర్భంగా బండి సంజయ్ ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా పలకరించారు.. ఓవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు బండి సంజయ్.. ఆయన ఆధ్వర్యంలో దుబ్బాక అసెంబ్లీలో స్థానంలో విజయం సాధించడం.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక, పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరడానికి ఆయన పావులు కదుపుతూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ.. అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
తాజావార్తలు
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!