ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఇంటర్ విద్యాసంస్థల బంద్ కు పిలుపునిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ కార్పొరేట్ విద్యాసంస్థల ముందు ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నారాయణగూడ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఇంటర్ బోర్డ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకే పేరుతో…
దేశంలో ధరల పెరుగుదల, ఉద్యోగాల్లో కోత, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న సార్వత్రిక సమ్మె ను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం 2020 ని రద్దు చేయాలని, ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని టిఎస్ యుటిఎఫ్…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మిషన్ 2024 లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రామికవర్గం, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ప్రజలను రక్షించండి.. దేశాన్ని కాపాడండి’ అనే నినాదంతో మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే…
ఈరోజు హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.…
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు. సిల్గేర్‌లో పెట్టిన సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. సిల్గేర్…