గత కొన్ని రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. సీస్‌ఫైర్ అమలులోకి వచ్చిన 2 గంటలకే ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్)…
రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్‌స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం (మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు.
ఉత్తర కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను (Ballistic Missiles) పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న టైంలో.. నార్త్ కొరియా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది.
అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది.
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది.