రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్‌స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి. అమెరికా రహస్యంగా ఈ క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపింది అనే విషయాన్ని అమెరికాకు చెందిన ఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే కాకుండా.. ఉక్రెయిన్ రష్యాలోని లిపెట్స్క్ ప్రాంతంలో ఉన్న పెద్ద ఉక్కు ఫ్యాక్టరీపై డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌కు ఆయుధాలను యూఎస్ అందించింది. ఈ క్షిపణులు రష్యాలోని జనాభా ఉన్న ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి. అలాగే, NATO కూటమితో ప్రత్యక్ష సంఘర్షణను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Read Also: YS Jagan Nomination: నేడు పులివెందులకు వైఎస్ జగన్.. నామినేషన్ దాఖలు
ఇక, ఉక్రెయిన్ అందుకున్న కొత్త క్షిపణి 300 కిలో మీటర్ల పరిధిని కలిగి ఉంది. 2023 అక్టోబర్ నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా ఈ క్షిపణులను సరఫరా చేయడం ప్రారంభించినట్లు తెలిసింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 95 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించడంతో.. ఈ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందిస్తుంది. ఈ యుద్ధంలో ఈ క్షిపణులను ఉపయోగించడం వల్ల ఉక్రెయిన్‌కు మరింత బలం చేకూరుతుంది. మరోసారి రష్యాతో పోటీపడే పరిస్థితి వస్తుందని యూఎస్ అభిప్రాయపడ్డింది. అయితే, ఉక్రెయిన్ చాలా కాలంగా ఇటువంటి సుదూర ఆయుధాలను డిమాండ్ చేస్తోంది. గతంలో ఉక్రెయిన్‌కు అమెరికా గరిష్టంగా 160 కిలో మీటర్ల పరిధి గల క్షిపణులను మాత్రమే ఇచ్చింది.