YCP : కొండేపి వైసీపీలో ఇంఛార్జ్ మార్పుపై రచ్చ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోతోంది. వైసీపీలోని రెండు గ్రూపులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌గా ఎవరు ఉన్నా ఓవర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోది. రెండో పక్షం వైరిపక్షంగా మారిపోతోంది. దీంతో కొండేపి వ్యవహారాలు తరచూ వైసీపీ పెద్దలకు తలనొప్పులుగా తయారైంది. ఇప్పుడు ఇంఛార్జ్ మార్పు విషయంలోనూ అదే జరిగింది.
మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్‌గా మాదాసి వెంకయ్య ఉన్నారు. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. అప్పటి వరకూ అక్కడ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబు కలసి పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓడినా వెంకయ్యను డీసీసీబీ ఛైర్మన్‌ను చేసింది పార్టీ. దీంతో ఓడినా ఆయనే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. అయితే ఇంఛార్జ్ పదవి పోయినప్పటికీ టంగుటూరులోనే మకాం ఏర్పాటు చేసుకుని వెంకయ్య శిబిరానికి అశోక్‌బాబు అండ్ టీమ్ కంట్లో నలుసులా మారిందంటారు.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మూడేళ్లుగా ఇదే వర్గపోరు కొండేపి వైసీపీలో కామన్ అయిపోయింది. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కష్టమని భావించారో ఏమో ఇంఛార్జ్‌గా ఉన్న వెంకయ్యను తప్పించి.. అశోక్‌బాబుకు మళ్లీ పట్టం కట్టారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేనికి అనుచరుడిగా అశోక్‌బాబుపై ముద్ర ఉంది. దాంతో పదవి రాగానే నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా సొంత టీమ్ వచ్చింది తప్పితే వెంకయ్య అనుచరులు కనిపించలేదు. వైసీపీ పెద్దల నిర్ణయంతో మనస్తాపం చెందిన వెంకయ్య సైతం సైలెంట్ అయ్యారు.
ఇన్నాళ్లూ కొండేపిలో తనను ఇబ్బంది పెట్టిన అశోక్‌బాబుకే ఇంఛార్జ్ పదవి ఇవ్వడంతో వెంకయ్య అండ్ కో అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. వెంకయ్య అనుచరులుగా ఉన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పెద్ద సంఖ్యలో బాలినేని, సజ్జల దగ్గరకు వెళ్లి తమ అసంతృప్తిని తెలియజేశారట. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని ఎలా ఇంఛార్జ్ చేస్తారని నిలదీసినట్టు సమాచారం. ఇప్పుడు ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్‌బాబులో ఎలాంటి మార్పు రాలేదని ఫిర్యాదు చేశారట. ఇందుకు కొన్ని సంఘటనలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తిరిగి వెంకయ్యనే ఇంఛార్జ్‌గా చేయ్యాలని డిమాండ్ చేశారట.
అసమ్మతి నేతల ఫిర్యాదులు వర్కవుట్ అయ్యాయో ఏమో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తాము చెప్పాకే చేపట్టాలని ఇంఛార్జ్ అశోక్‌బాబుకు పార్టీ పెద్దల నుంచి సమాచారం వెళ్లిందట. దీంతో అప్పటికప్పుడు ప్రొగ్రామ్ ఆపేసిన ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారట. కేవలం మౌఖిక ఆదేశాలతోనే అశోక్‌బాబును ఇంఛార్జ్‌గా పెట్టారని.. తిరిగి వెంకయ్యే వస్తారని ప్రస్తుతం ప్రచారం ఊపందుకుంది. దీంతో కొండేపి విషయంలో వైసీపీ ఆలోచన ఏంటో.. ఎవరిని బుజ్జగిస్తారో.. ఎవరిని పక్కన పెడతారో అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!