ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నోట ఏ మాట పలికినా, అది మధురామృతంగా మారిపోతుందని అందరికీ తెలుసు. సందర్భానుసారంగా తన స్వరాన్ని సవరించుకొనే బాలు నటుల విలక్షణమైన వేషధారణలోనూ అందుకు తగ్గట్టుగా గానం చేసి మురిపించారు. ఇక ఆయనతో పాటు ఇలాంటి పాటల్లో గళం విప్పడానికి సాటి గాయకులు సైతం ఉత్సాహంతో ఉరకలేసి మరీ పాడారు. తెలుగు చిత్రసీమలోని టాప్ స్టార్స్ అందరికీ ఒకప్పుడు ఎస్పీ బాలు గాత్రం తప్ప మరో ఆధారం లేదు. ఇక టాప్ హీరోస్ వరైటీ…