ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో స్టేటస్ అనుభవిస్తున్న వారిలో.. ఎక్కువ మంది స్టార్ హీరోల వారసులే ఉన్నారు. మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారుసులుగా.. తరానికో స్టార్ హీరో వస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో తరం వారసులు రెడీ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వారసులపైనే ఉంది. ఇప్పటికే వారి ఎంట్రీ గురించి రకరకాల కథనాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ల గురించి సోషల్ మీడియాలో…
సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. రెండు వారాల క్రితం హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం వైసీపీ వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఈస్థాయిలో ఎక్కడా వర్గపోరు లేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నవీన్ నిశ్చల్‌ను కాదని.. 2019లో మాజీ పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని టాక్. బాలకృష్ణ చేతిలో ఇక్బాల్ ఓడినా.. తర్వాత ఆయన్ని ఎమ్మెల్సీని చేశారు. అప్పటి నుంచి హిందూపురంలో ఇక్బాల్ పెత్తనం పెరిగడం.. నవీన్ వర్గానికి అస్సలు రుచించడం…
జై బాలయ్య అంటే చాలు.. నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. దాంతో చాలా ఏళ్లుగా జై బాలయ్య అనేది.. ఓ స్లోగాన్గా మారిపోయింది. ఇక థియేటర్స్ అయితే.. ఈ నినాదాని షేక్ అయిపోతుంటాయి. ఒక్క సినిమా విషయంలోనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. జై బాలయ్య అంటూ హల్ చల్ చేస్తుంటారు అభిమానులు. అలాంటిది అదే టైటిల్‌తో బాలకృష్ణ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పడు బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇదే టైటిల్…
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది. ఎఫ్3 ప్రమోషన్…
అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 107 చిత్రం చేస్తున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ బాలయ్య అభిమానులను ఊపేస్తోంది. ఈ సినిమాలో ఒక మాస్ సాంగ్ ఉండనున్న సంగతి తెలిసిందే.. ఆ స్పెషల్ సాంగ్ లో…
నందమూరి బాలకృష్ణ, గోపించంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కు మంచి టైటిల్ ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్.. ఇకపోతే ఈ సినిమా గురించిన…
తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది.…
సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా తాతినేని రామారావు లేరన్న వార్త ఎంతగానో కలచి వేసిందని, ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం “దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన…
తెలుగు ఇండియన్ ఐడిల్ వీక్షకులకు ఒక రోజు ముందే ఉగాది వచ్చేసింది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కు అయితే శుక్రవారం స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ డబుల్ ధమాకాను ఇచ్చింది. ఉగాది స్పెషల్ గా రూపుదిద్దుకున్న ఈ ఎపిసోడ్ లో శుక్రవారం కంటెస్టెంట్స్ ఐదుగురు నందమూరి బాలకృష్ణ సినిమా పాటలు పాడగా, ఒకరు నటరత్న ఎన్టీయార్ మూవీ పాట పాడారు. దాంతో నందమూరి అభిమానులకు ఈ ఎపిసోడ్ పండగే పండగ అన్నట్టుగా మారిపోయింది. శుక్రవారం టెలికాస్ట్ అయిన తెలుగు…