నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NBK 107 వర్కింగ్ టైటిల్ తో రూపిందున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ఈ మూబీ షూటింగ్ లో క్రాక్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రత్యక్షమై అందరినీ ఆకర్షించింది. తెలుగులో ఎన్నో సూపర్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతూ.. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో రవితేజ సరసన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది. అయితే.. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ హీరో సినిమా సెట్లో సందడి చేసింది.
#NBK 107 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న సినిమాలో ఈముద్దుగుమ్మ బాలయ్య సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని పోస్టర్ లోనూ బాలయ్య కనిపించాడు. కానీ.. ఇప్పుడు బాలయ్యతో శ్రుతి ఎంట్రీ ఇస్తోందని , ఈ విషయాన్ని డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ఖాతాలో తనతో శ్రుతి డైరెక్షన్ స్టార్ట్ అంటూ పోజులిచ్చిన ఫోటోను పోస్ట్ చేశాడు. గోపిచంద్ , శ్రుతి వున్న ఫోటోను చూసిన శ్రుతి హాసన్ అభిమానంతా వావ్ అంటూ ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైన బాలయ్యతో ఈభామ అటు బాలయ్య అభిమానులకు, ఇటు శ్రుతి అభిమానులను ఎలా ఆకట్టుకుట్టుందో చూడాలి.
Most talented n favourite @shrutihaasan on sets #NBK107🔥🔥🔥🔥🧿 pic.twitter.com/iSdmX4zrn9
— Gopichandh Malineni (@megopichand) June 18, 2022
Chandrababu : సమాధానం ఇచ్చే దమ్ములేని జగన్ కూల్చివేతలకి పాల్పడ్డారు