ఓ కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు, విద్యార్థి విభాగం నాయకుడికి బెయిల్ వచ్చింది.. దీంతో, అతడికి అనుకూలంగా సంబరాలే జరిగాయి… ఏకంగా పోస్టర్లు వెలిశాయి.. అయ్యగారి కీర్తిని చాటుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడు బెయిల్ రద్దు చేసింది.. అంతే కాదు వారం రోజుల్లో లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అత్యాచారం కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్ యువకుడికి బెయిల్…
ఏపీలో ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇంటికి వెళ్ళి చాలా మాట్లాడారు.ౠ మాటలు విని చాలా ఆచ్చర్యపోయాను. అరెస్ట్ చేయటానికి ముహుర్తం , వర్జ్యం , రాహుకాలం చూస్తారా? అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. అరెస్ట్ కి ముహుర్తం కావాలంటారు… బెయిల్ పిటిషన్ కు మాత్రం చంద్రబాబుకు సమయం సందర్బం అవసరం లేదు. అర్దరాత్రి అయినా విచారణ జరగాలని హౌస్ మొషన్ పిటిషన్ వేస్తారు.…
దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు పై కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని సందర్భాల్లో చేయని నేరానికి అమాయకులు బలి అవుతుంటారు. అలాంటప్పుడు వారికి బెయిల్ దొరకడమే కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఒక కేసు విచారణ సమయంలో కోర్టుకు సబబు అనిపిస్తే బెయిల్ మంజూరు చేయవచ్చు. Read Also: మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని ఒమిక్రాన్ ఏదైనా…
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన కేసులో శిల్ప చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. శిల్ప చౌదరి కేసులో ఊహించని షాక్ తగిలింది. శిల్ప చౌదరి కి బెయిల్ నిరాకరించి.. రిమాండ్ విధించింది ఉప్పర్ పల్లి కోర్టు. ఈ కేసులో 2 రోజుల పాటు ఎక్సటెన్షన్ కస్టడీ కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. అదే సమయంలో… శిల్ప చౌదరి కూడా బెయిల్ పిటీషన్…
విశాఖ : టిక్ టాక్ స్టార్ ఫన్ బకెట్ భార్గవ్ కు బెయిల్ రద్దు అయింది. భార్గవ్ కు మరోసారి రిమాండ్ విధించింది పోక్సో కోర్టు. అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకున్న భార్గవ్… పెందుర్తి పిఎస్ కేసులో ఏప్రిల్ 18 న అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో జూన్ 15 న షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. బెయిల్ పై బయటకు వచ్చాక… షరతులతో కూడిన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు భార్గవ్.…
రాజస్తాన్ లో ఎవరిపైనైనా కోపం పగ ఉంటే వారిని పాముతో కాటు వేయించి చంపేస్తున్నారు. ఆ తరువాత పాము కాటుతో చనిపోయినట్టు చిత్రీకరిస్తూ నేరస్తులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ కోనసాగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ ధర్మాసం పేర్కొన్నది. దీనిపై ధర్మాసనం సీరియస్ అయింది. రాజస్థాన్‌లోని జుంజుహు జిల్లాలోని ఓ గ్రామంలో సుబోద్ దేవీ అనే మహిళ కుమారులిద్దరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద కుమారుడు సచిన్‌కు అల్ఫాన్సా అనే యువతితో 2018 డిసెంబర్ 18…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికి మహద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, రాణేను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా,…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో క్వారీ తవ్వకాలపై పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసును కూడా నమోదు చేశారు. దీంతో దేవినేని ఉమను ఐదురోజుల క్రితం రాజమండ్రి జైలుకు తరలించారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై…
పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరోసారి ఎదురుదెబ్బ తగలింది.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,500 కోట్ల రుణం ఎగవేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. 2018లో భారత్ విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత మళ్లీ తాజాగా దొరికిపోయాడు.. అయితే, బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి… చోక్సీకి బెయిల్ ఇచ్చేందుకు డొమినికా హైకోర్టు నిరాకరించింది. డొమినికాతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి పారిపోనని ఇచ్చిన హామీని…