హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రా నగర్ లో ఆంజనేయులును అతని తమ్ముడు సురేష్ కుమార్ బండ రాయితో తలపై మోదీ హత్య చేశాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చాంద్రాయణగుట్ట సిఐ ప్రసాద్ వర్మ వారి సిబ్బందితో కలిసి చేరుకొని క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు.