Old City of Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రా నగర్ లో ఆంజనేయులును అతని తమ్ముడు సురేష్ కుమార్ బండ రాయితో తలపై మోదీ హత్య చేశాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చాంద్రాయణగుట్ట సిఐ ప్రసాద్ వర్మ వారి సిబ్బందితో కలిసి చేరుకొని క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. తమ్ముడు సురేస్ ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేష్ కుమార్ కొద్దీ కాలంగా మానసిక స్థితి సరిగ్గా లేదని మృతుడి, నిందితుడి తల్లి తెలిపింది. తాజాగా నిందితుడు అతని వదినపై కూడా దాడి చేస్తూ పిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలాన్ని ఏసీపీ ఫలక్ నుమా షేక్ జహంగీర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు మానసిక స్థితి
సరిగా లేదని అతన్ని అదుపులో తీసుకున్నామని అన్నారు.