రాజకీయాల్లో గుమ్మడికాయంత అవకాశాలే కాదు.. ఆవ గింజంత అదృష్టం ఉండాలి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఈ విషయం తెలియంది కాదు. ప్రభుత్వ అధికారిగా.. ప్రజాప్రతినిధిగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన.. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయారు. తన సహజమైన వ్యక్తిత్వందాటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు గొల్ల బాబూరావు. తనను తాను…