కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన…
దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు. పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ…
కాంగ్రెస్ కప్పులో అసమ్మతి తుఫాన్ రేగుతోంది. నిన్న సమావేశమయిన జీ23 నేతలు మరోసారి ఇవాళ కూడా భేటీ అయ్యారు. గంటన్నర పైగా చర్చలు కొనసాగినట్టు తెలుస్తోంది. అజాద్ నివాసంలో అసమ్మతి నేతల సమావేశం ముగిసింది. గులాం నబీ ఆజాద్ నివాసంలో కాంగ్రెస్ అసమ్మతి నేతల సమాలోచనలు కాక పుట్టిస్తున్నాయి. ఈ సమావేశానికి హజరయ్యారు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, భూపేందర్ సింగ్ హుడా. ఈ రోజు ఉదయం రాహుల్ గాంధీ తో సమావేశమై, ముఖాముఖి చర్చలు జరిపిన…
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు…