Ayyanna Patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్నది అభియోగం.
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల…
స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి విశాఖజిల్లా…
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని…
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని అయ్యన్న ఇంటి వెనుకాల గోడను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ ఘటనపై టీడీపీ చీఫ్ చంద్రబాబు మాట్లాడుతూ.. అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ చీకటి దాడులు చేసిందంటూ ఆయన మండిపడ్డారు. అయ్యన్న ఇంటి గోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. టీడీపీలో బలమైన బీసీ నేతలని…