అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మాజీ మంత్రులు సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి సాగిన సందర్భాలు లేవు. 2014-19 మధ్య అయ్యన్న, గంటా ఇద్దరు చంద్రబాబు కేబినెట్ మంత్రులు. ఆ సమయంలోనూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు అరుదే. ఒకరిని ఇరుకున పెట్టేందుకు మరొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకునేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యన్న గళం విప్పుతుంటే.. రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగుసార్లు పార్టీ మారిన చరిత్ర గంటాది. విశాఖ…
విశాఖపట్నం ఎన్‌సీసీ భూముల వివాదంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఎన్‌సీసీ భూముల లావాదేవీలు జరిగాయని, తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్‌సీసీ కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆల్జీ మర్స్ తో బాధ…
సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరింది… ఉగాది కానుకగా పేద, మధ్య తరగతిపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని.. ఇది పెను భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏడు సార్లు పెంచిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్న ఆయన.. ఎమ్మెల్యేలు గానీ,…
ఏపీలో రాజకీయం ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ హస్తం ఉండొచ్చని వివేకా అల్లుడు రాజశేఖర్ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ టీడీపీ నేత చంద్రబాబు చేతిలో పావులుగా మారారని ఆయన ఆరోపించారు. దీంతో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అకారణంగా పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో పశ్చిమ గోదావరి…
అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. రాజకీయాల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు అయ్యన్న. చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ, పెళ్లి…
రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆ మాజీ మంత్రి..! ఇప్పుడు కుమారుడి పొలిటికల్ ప్యూచర్ కోసం వ్యూహ రచన చేస్తున్నా వర్కవుట్ కావడం లేదట. రూటు మార్చి ప్లాన్ బీ అమలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? మంత్రిగా ఉన్నప్పుడు తన విమర్శలతో టీడీపీని ఇరుకున పెట్టారు..! విశాఖజిల్లా, నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్‌లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో…
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. సానుభూతి వస్తుందనుకుంటే జగన్ తనపై తానే ఉమ్మేసుకునే రకమని ఆయన ఆరోపించారు. పట్టాభి తిట్టింది జగన్‌ను కాదని.. సజ్జలను అని.. సానుభూతి కోసం జగన్ తననే అన్నారని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. ఓట్లు, సీట్లు వస్తాయని గతంలో బాబాయ్ శవం దగ్గర నుంచి కోడికత్తి వరకు దేనిని వదల్లేదని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇప్పుడు కూడా పట్టాభి తిట్టిన బోసిడీకే…
టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత…
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి…