తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తనదైన రీతిలో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.. కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణమే కేంద్రం వాటా విడుదల చేస్తున్నాం..2021 వరకు తెలంగాణ ఆయుష్మాన్ భారత్‌లో ఎందుకు చేరలేదు?. మీడియా సమావేశంలో నేనేం మాట్లాడానో మంత్రి హరీష్ రావు పూర్తిగా తెలుసుకోవాలి.
మంత్రి హరీష్ రావు వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కౌంటర్ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో ఉన్న ప్రాజెక్ట్‌కు హైదరాబాద్ ఎంపీ ఫొటో పెడతారా? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటున్నాయి. రాష్ట్ర మంత్రులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40 శాతం రాష్ట్రాలు భరించాలి. హైదరాబాద్ నుంచే తెలంగాణకు 55 శాతం ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లాభసాటి కాదని నిపుణులే అంటున్నారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర వైఖరిని ఆమె తప్పుబట్టారు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్రానిది బాధ్యత కాదు.
Read Also: Minister Vishwarup Health: మంత్రి విశ్వరూప్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
కేంద్రం ఇచ్చే నిధులు సక్రమంగా అమలు కావడానికే డిజిటలైజేషన్ తెచ్చాం. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పార్లమెంట్ ప్రవాస్ యోజన ఉంది. ప్రతీ పథకంలో కేంద్రం వాటా ఉంటుంది. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయి. ఏ కారణంతో సెస్ వసూలు చేశారో.. వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలి. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే ఉన్నాము.
ఈ స్టేట్‌కు తక్కువ, ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వడం అనేది ఉండదు అని స్పష్టం చేశారు. అది నా చేతుల్లో వుండదన్నారు నిర్మలా సీతారామన్. ఉచిత పథకాలకు అవసరమయిన రెవిన్యూ మన దగ్గర వుందో లేదో చూసుకోండి.. అప్పు తీసుకుని అప్పు తీర్చడం ఈ ప్రభుత్వ బాధ్యత.. ఉచిత విద్యుత్ భారం ప్రభుత్వం భరించాలి.. డిస్కంలు, జెన్కోలకు సంబంధం ఏంటి? ఓట్లు అడిగింది మీరు.. ఆ భారం గురించి ప్రజలకు వివరించాలన్నారు.
ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిధులు రాష్ట్రాలకు ఇస్తున్నాం.. 60 శాతం కేంద్రం నిధులు ఇస్తే.. 40 శాతం రాష్ట్రం భరించాలి….కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు… తెలంగాణ సమస్యల గురించి ప్రజలకు తెలుపుతాం అన్నారు ఆర్థిక మంత్రి. తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపడంలేదని రాష్ట్ర శాఖ అడుగుతోంది… దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు నిర్మలా సీతారామన్.
Read Also: Pawan Kalyan: ఆ సినిమా అప్డేట్ రాలేదేంటి?