ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్‌కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు…
తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది
Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పూరీ పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద మాట్లాడుతూ.. శంకరాచార్యులకు వారి స్వంత గౌరవం ఉంటుంది.. ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు.. ప్రధానమంత్రి ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు మనం బయట కూర్చుని చప్పట్లు కొట్టాలని భావిస్తున్నారా?.. సంప్రదాయాలను తారుమారు చేయడం లౌకిక ప్రభుత్వం చేసే పని కాదు అని ఆయన పేర్కొన్నారు.
Amitabh Bachchan : రామమందిరం ప్రాణ ప్రతిష్టా వేడుకకు ముందు అమితాబ్ బచ్చన్ ఒక ప్రత్యేక పని చేశారు. అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రూ.14.5 కోట్ల విలువైన ప్లాట్ను కొనుగోలు చేశారు.