Konaseema Coconut Bonds: ఇప్పుడు ఎక్కడ విన్నా అయోధ్యపై చర్చ సాగుతోంది.. అయోధ్యలో శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి జరుగుతున్నాయి. కోట్లాదిమంది భక్తులు ఆ కోదండ రాముడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22వ తేదీన రాములవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆయోధ్యకు ఏది వెళ్లినా భక్తులు ఆసక్తిగా గమనిస్తున్నారు.. ఇప్పుడు మన కోనసీమ కొబ్బరి బోండాలు కూడా అయోధ్యకు వెళ్తున్నాయి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి ఈ నెల 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కొబ్బరి బోండాలను తరలించారు.
Read Also: Guntur Kaaram: 2.5 మిలియన్ డాలర్స్… టాక్ తో సార్ కి సంబంధమే లేదు
అయోధ్యలోని సీతమ్మ ఆశ్రమం కోరిక మేరకు శంకు చక్ర నామ కొబ్బరి బోండాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి.. రాముడికి కానుకగా పంపారు మండపేటకు చెందిన రామారెడ్డి, మహాలక్ష్మి దంపతులు. అయోధ్య రాములవారి విగ్రహప్రతిష్టాపన కార్యక్రమానికి శంకు చక్ర నామ కొబ్బరి బోండాలు తయారుచేసి పంపడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నరామని వారు ఆనందం వ్యక్తం చేయగా.. ఈ రోజు ఆ కొబ్బరి బోండాలు అయోధ్య చేరుకోనున్నాయి.. అక్కడ ఉత్సవ నిర్వహణ కమిటీకి ఈ బోండాలు సమర్పించనున్నారు మండపేట వాసి.. అయోధ్య రామమందిరంలో శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలో మన మండపేటకు చెందిన కళ్యాణ కొబ్బరి బోండాలను వినియోగించనున్నారు. మొత్తంగా భారత్‌తో పాటు ప్రపంచంలోని ప్రతీ హిందువు ఆసక్తిగా ఎదరుచూస్తోన్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన కోనసీమ కొబ్బరి బోండాలు కూడా భాగస్వామ్యం కానున్నాయి.