Vegetarian Hotel: భవ్య రామమందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోతున్నాయి. రానున్న కాలంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ప్రపంచంలోనే తీర్థయాత్ర గమ్యస్థానంగా మార్చేందుకు ఉత్తర్ ప్రదేశ్ కృషి చేస్తోంది. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 7000 మంది ప్రముఖులతో పాటు లక్షలాది మంది అయోధ్యకు రాబోతున్నారు. ఇప్పటికే యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లును చేసింది.
Read Also: Killer Soup: కిల్లర్ సూప్.. తెలంగాణలో జరిగిన రియల్ కథ అని తెలుసా.. ?
ఇదిలా ఉంటే ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శాఖాహార సెవన్-స్టార్ హోటల్ అయోధ్యలో రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయోధ్యలో మొత్తం 25 కొత్త హోటల్ ప్రతిపాదనలు వచ్చాయని.. వీటిలో ఒకటి ప్రత్యేకంగా శాఖాహార హోటల్ ఉందని చెప్పారు. ఆలయ ప్రారంభం తర్వాత భక్తుల రద్దీతో పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఆలయాన్ని సందర్శించే భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు యోగి సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే అయోధ్యలో అత్యాధునిక హంగులతో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దారు. అయోధ్య నుంచి వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లను కలుపుతూ.. గ్రీన్ కారిడార్ ప్రణాళికను యూపీ సర్కార్ తీసుకురాబోతోంది.
రామ మందిర నిర్మాణంతో అయోధ్యకు కొత్త కళ వస్తేస్తోంది. హోటళ్లు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆలయం నుంచి 15 నిమిషాల దూరంలో విలాసవంతమైన ఎక్స్‌క్లేవ్ ‘ది సరయు’లో ఒక స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరయు నది ఒడ్డున అనేక ఫైవ్ స్టార్ హోటల్స్ రాబోతున్నాయి. 110 చిన్న పెద్ద హోటళ్లు అయోధ్యలో ఏర్పాటు చేసేందుకు భూమిని కొనుగోలు చేస్తున్నారు. మొట్టమొదటి వెజ్ 7-స్టార్ హోటల్‌ని ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది.