Ayman al-Zawahiri-Taliban: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని హతమార్చినట్లు స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించారు. 9/11 అమెరికా ట్విన్ టవర్స్ దాడులపై ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికా భావిస్తోంది. అమెరికన్లకు హాని తలపెట్టే ఏ ఒక్క ఉగ్రవాదిని ఉపక్షించబోం అని అమెరికా చెబుతోంది. ఇటీవల కాబూల్ లో ఆశ్రయం పొందుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా తన డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించి హతం చేసింది. రాజధా
బాల్యం నుంచే మతంపై ఆసక్తి పెంచుకున్న అల్ జవహరి.. మతపరమైన అంశాలను గమనించేవాడు. కంటి వైద్యుడైన అల్ జవహరి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం మొత్తం తిరిగాడు. సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కళ్లారా చూశాడు. ఆ సమయంలోనే యువకుడైన ఒసామా బిన్ లాడెన్‌ను, సోవియట్ బలగాలను ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టేందుకు సాయపడుతున్న అరబ్ తీవ్రవాద గ్రూపులను కలిశాడు.