ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆస్ట్రేలియాకు చెందిన ఆప్లే బార్టీ నిలిచింది. శనివారం మధ్యాహ్నం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో అమెరికన్ ప్లేయర్ కొలిన్స్‌పై 6-3, 7-6 తేడాతో బార్టీ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. తొలుత కొలిన్స్ ఓ బ్రేక్ పాయింట్ సాధించినా.. ఆ తర్వాత బార్టీ ఆధిపత్యం మొదలైంది. ఓ దశలో 1-5 తేడాతో వెనుకబడ్డ బార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం వైపు అడుగులు…
రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చరిత్రను తిరగరాస్తాడు. 35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 7వ ర్యాంకు ఆటగాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్‌లో 29వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే…
ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్‌కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్‌లోని స్కాట్ మోరిసన్ సర్కార్‌పై పరువు నష్టం దావా…
టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం… జకోవిచ్ వీసాను రెండోసారి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ టెన్నీస్ స్టార్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించింది ఆసీస్.. కరోనా నిబంధనలు పాటించనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఇటీవలే మెల్‌బోర్న్ వెళ్లారు జకోవిచ్.. అయితే, అనూహ్యంగా ఎయిర్‌పోర్ట్ నుంచే జకోవిచ్‌కు వెనక్కి పంపించారు అధికారులు.. తాజాగా, మరోసారి వీసాను రద్దు చేయడంతో.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో జకోవిచ్ పాల్గొనే అవకాశం లేకుండా…