World Cup 2023 Points Table: టాప్‌లో దక్షిణాఫ్రికా.. 9వ స్థానంలో ఆస్ట్రేలియా! భారత్ ప్లేస్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Latest ICC World Cup 2023 Points Table: ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికాకు ఇది రెండో విజయం. రెండు భారీ విజయాలు అందుకున్న ప్రొటీస్ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా రన్‌రేట్ (+2.360) కూడా మెరుగ్గా ఉంది.
అక్టోబరు 8న జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోయింది. ప్రపంచకప్ 2023లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆసీస్.. రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రన్‌రేట్ (-1.846) నెగటివ్‌లో ఉంది. పసికూనలు అఫ్గాన్, నెదర్లాండ్స్ సరసన ఆసీస్ ఉండడం విశేషం. టోర్నీలో ఆస్ట్రేలియా ముందడుగు వేయాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అంతేకాదు మెరుగైన రన్‌రేట్ కూడా చాలా అవసరం.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ప్రపంచకప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజీలాండ్ రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్‌పై గెలిస్తే.. కివీస్ టాప్‌కు దూసుకెళుతుంది. సొంతగడ్డపై బరిలోకి దిగిన భారత్ రెండింటిలో గెలిచి మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లలో గెలిచిన పాకిస్తాన్ పట్టికలో నాలుగో స్థంలో ఉంది. ఈ నాలుగు జట్లకు నాలుగేసి పాయింట్స్ ఉన్నా.. రన్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది.
ప్రపంచకప్ 2023లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్, బాంగ్లాదేశ్ జట్లు ఒక్కో విజయంతో 2 పాయింట్స్ ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో వరుసగా 5, 6 స్థానాల్లో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లలో ఓడిన శ్రీలంక, నెదర్లాండ్స్ టీమ్స్ వరుసగా 7, 8వ స్థానంలో ఉన్నాయి. 9వ స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. రెండు మ్యాచ్‌లలో ఓడిన అఫ్గాన్ అట్టడుగున ఉంది. పాయింట్ల పట్టికలో చివరి ఐదు స్థానాల్లో ఉన్న జట్లకు రన్‌రేట్ నెగటివ్‌లో ఉంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!