యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖవాజాకు ఆస్ట్రేలియా టీమ్ విజయంతో అద్భుతమైన వీడ్కోలు ఇచ్చింది. 88 టెస్టుల కెరీర్‌లో ఆస్ట్రేలియాకు చేసిన సేవలకు ఘనంగా గుర్తింపు లభించింది. సిడ్నీ టెస్టు అనంతరం తాను రిటైరవనున్నట్లు…
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ బాదాడు. ఇది అతడికి 37వ టెస్ట్ సెంచరీ కాగా.. యాషెస్ సిరీస్‌లో 13వ శతకం. దాంతో ఇంగ్లాండ్ లెజెండ్ బ్యాటర్ జాక్ హాబ్స్‌ను అధిగమించి.. యాషెస్ చరిత్రలో రెండవ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ (19 సెంచరీలు) మొదటి స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా (10), వాలీ హామండ్…
2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాస్టర్ బ్యాట్స్‌మన్ జో రూట్ మరోసారి సత్తాచాటాడు. సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో రూట్ అద్భుత శతకం బాదాడు. మైకేల్ నెసర్ వేసిన బంతికి రెండు పరుగులు తీసి.. సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో ఇది అతడికి రెండో సెంచరీ కాగా.. టెస్టు క్రికెట్‌లో మొత్తం 41వ సెంచరీ. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ సరసన నిలిచి.. ఆల్‌టైమ్ టెస్టు సెంచరీల జాబితాలో మూడో స్థానాన్ని పంచుకున్నాడు.…
2025-26 యాషెస్ సిరీస్‌లో ఐదవ టెస్ట్ జనవరి 4-8 మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. ఇప్పటికే తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జట్టులో రెండు మార్పులు చేయబడ్డాయి. ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్, స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. గస్ అట్కిన్సన్‌ను జట్టు నుంచి తొలగించారు. ఇంగ్లండ్ సిరీస్‌లో 3-1 తేడాతో వెనుకబడి…
2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన నాల్గవ టెస్టులో (బాక్సింగ్ డే టెస్ట్) ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో రోజు 175 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై పరాజయాల పరంపరకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేసింది. దాదాపు 15 సంవత్సరాల (5,468 రోజులు) అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లీష్ టీమ్ విజయం…
2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ మొదటి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి. ఆతిథ్య ఆసీస్ 45.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 29.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. అయితే ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా…
AUS vs ENG 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152…
AUS vs ENG: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. 52 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
AUS vs ENG: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది.
AUS vs ENG ODI: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పటిలాగే ఇంగ్లండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డు గోడలా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఇక మొదట బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ బెన్…