AUS vs ENG: యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌లో తలపడుతున్నాయి. ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. 52 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 213/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో 3వ రోజు ఆటను స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ 286 రన్స్ కి ఆలౌట్ అయింది. బెన్‌స్టోక్స్ (198 బంతుల్లో, 8 ఫోర్లతో 83 రన్స్), జోఫ్రా ఆర్చర్ (105 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 పరుగులు) హాఫ్‌సెంచరీలు సాధించడంతో ఇంగ్లీష్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ ( 63 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 రన్స్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేయగా.. మిగతా వారంతా బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఇక, ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోల్యాండ్ తలో 3 వికెట్లు తీసుకోగా, నాథన్ లియాన్ 2, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.
Read Also: SIGMA : జాసన్ సంజయ్ సిగ్మా.. షూటింగ్ ఫినిష్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (104*; 148 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్ క్యారీ ( 28: 54 బంతుల్లో 2 ఫోర్లు) ఉన్నారు. అయితే, ఉస్మాన్ ఖవాజా (40) ఫర్వాలేదనిపించినా.. జేక్ వెదర్లాడ్ (1), లబుషేన్ (13) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 2 వికెట్లు తీసుకోగా, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ తలో వికెట్ తీసుకున్నారు.