AUS vs ENG ODI: ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పటిలాగే ఇంగ్లండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డు గోడలా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఇక మొదట బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ బెన్ డకెట్ శుభారంభం అందించాడు. 91 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టుకు శుభారంభం అందించాడు. విల్ జాక్వెస్ కూడా 56 బంతుల్లో 62 పరుగుల హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ సాధించి జట్టును ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. ఈ కారణంగా ఇంగ్లాండ్ జట్టు 315 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మార్నస్ లాబుషాగ్నే, స్పిన్నర్ ఆడమ్ జంపా చెరో 3 వికెట్లు తీశారు. ట్రావిస్ హెడ్ 2 వికెట్లు తీశాడు.
Train Incident: దారుణం.. రైలును బోల్తా కొట్టించేందుకు భారీ కుట్ర!
ఇక దీని తర్వాత, హెడ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒక ఎండ్ నుంచి వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్ బౌలర్లు ట్రావిస్ హెడ్ వికెట్ కోసం తహతహలాడారు. కేవలం 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ దక్కించుకోగా, ఆస్ట్రేలియా 169 పరుగుల వద్ద ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. అయితే మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ నిలదొక్కుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ట్రావిస్ హెడ్ బాగా పని పెట్టాడు. తొలుత యాభై పరుగులు చేసి, ఆ తర్వాత గేర్ మార్చి సెంచరీకి చేరుకున్నాడు. ఇక్కడితో హెడ్ ఆగలేదు. చివరి వరకు ఉండి జట్టును విజయానికి చేరువ చేశాడు. హెడ్ 129 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 154 పరుగులు అజేయంగా చేయగా, మరో ఎండ్‌లో లాబుషాగ్నే 77 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Australia's injury toll continues to mount but it didn't stop them cruising to a sixth straight men's ODI win over England! #ENGvAUS
Report: https://t.co/2WgffeoHVR pic.twitter.com/OT3xUtnc15
— cricket.com.au (@cricketcomau) September 19, 2024