నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని…
ఏపీలో కొన్నిరోజుల్లో మరోసారి ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. నేటితో ఆత్మకూరు ఉప ఎన్నిక నామినేషన్‌ల పర్వం కూడా ముగిసింది. చివరి రోజైన సోమవారం నాడు 13 నామినేషన్‌లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 28 నామినేషన్లు దాఖలైనట్లు స్పష్టం చేశారు. మంగళవారం నాడు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూరంగా ఉండటంతో ప్రధానంగా…